ఏమైనా అన్నానా....
నిన్ను నేనేమైనా అన్నానా
శాంతంగా వినిపించిందో మాట
ఏమీ అనలేదులే కాని
ఏమీ కాదంటూ ఊరడించలేదుగా...
అక్కడో ఇక్కడో ...
కారణమంటూ లేకుండా
ఎన్నో మారణహోమాలు జరుగుతాయి
అన్నిట్లో ఒకటి మాత్రం ప్రత్యేకం
రక్తంతో భూమి తడిసినా
యుద్ధభేరీ మోగిన...
తెలియకుండానే
నీకు నాకు మధ్యన ఎత్తైన గోడ
ఉన్నట్టుగా ఉంటుంది...
నిర్దోషిత్వం నిరూపించుకుంటున్నట్టు
నీ వైపు అడిగేసి ఎలా ఉన్నావ్ అని
అడగడానికి యుగాలు పడుతుంది...
నేను ఏ తప్పు చేయలేదని
నువ్వూ అంటావు, నేను అనుకుంటాను
అయినా ...
చిన్నగీత ఒకటి ఉన్నట్టుగానే అనిపిస్తుంది
నువ్వు నేను ఒక ఊరి వాళ్ళమే
ఒకవైపునే ఉన్నా....
నేను సంజాయిషీ ఇవ్వడం సరియైనదని
మాటిమాటికి అనిపిస్తుంది.. ఎందుకో
నీలోనూ ... నాలోను