అబ్బో
ఇతను ఎంతో పొదుపరి
అన్నిటికంటే మాటల్లో మరింత
ఇదేమి చిత్రమో
ఈమధ్య
పంచిన నాలుగు మాటలు
వెనక్కు తీసుకోవడమూ వచ్చింది..
విని వినిపించకుండా అంటాడా!!
ఏమిటంటూ వెనుదిరిగితే
ఏమీ లేదంటూ నవ్వుతూ దాటేస్తాడు
అన్నమాట వినిపించక
అన్నది ఏమిటో తెలియక
ఈ పొదుపరితో...
చిక్కటి చిక్కుముడిలా
అక్కడే ...... చిక్కుకుపోతాను రోజంతా
ఓయ్ ..
నిజం చెప్పు
ఇందులో తిరకాసు కథలేమి లేవు కదా