తెల్లవారకుండానే పసిపిల్లాడిలా
పరిగెత్తుకుంటూ వచ్చి ఎదుట నిలిచాడు
మాటైనా పలకకుండా
తేరిపారా చూస్తున్నాడు పెద్దమనిషిలా
అంతులేని అగాధం ఈది వచ్చి
చల్లగాలికి తెప్పరిల్లుతున్నట్టు ఎంత బాగున్నాడో
నాకంటే ముందుగా
నేను నీకెలా తెలుసంటూ
మెటికలు విరుస్తూ దిష్టి తీశాడు
తను ఆశ్చర్యపోతూ
నన్ను మరింత ఆశ్చర్యపరుస్తూ
క్షణంలో ఆగమాగం చేసి వెళ్ళాడు...
ఓయ్
నాకు తెలిసిన
ఈ పసిపిల్లాడి రూపు
నీకెలా చిక్కిందోయ్ రాకుమారా...