Why am I worried?
ఆకాశమంత ప్రేమిస్తున్నానని
చెబుతూ చెబుతూ...
అసలు
ప్రేమించడం అంటే ఏంటో
వివరణ చెప్పడానికి అర్థమే దొరకట్లేదు..
రాత్రి సముద్రపు కెరటాల మధ్యన ఆణిముత్యాలు వెతుక్కున్నట్టు
అంతా ప్రేమేనంటూ చిన్ని చిన్ని
అపురూపాలన్ని మూట కట్టుకుంటాను...
అదేమిటో తెల్లవారితే చాలు
ఆకాశాన నక్షత్రాలు మాయమైనట్టు
ఆనవాలే లేకుండా ఏమారిపోతాయి ...
అయితేనేం... పట్టువీడక
కనిపించే మనుషుల మధ్యన
కనిపించని మనసుల మధ్యన అల్లిబిల్లిగా
తీరం చేరని కెరటంలా
వెతుకుతూనే ఉంటాను...
ఈ వెతుకులాటలో
దారి తప్పిపోతాననే
కించిత్తు భయమెందుకో
మనసంతా అల్లుకుంది...
ఓయ్
ఎప్పుడైనా....
ఎక్కడైనా తారసపడితే
కాస్తంత వెనుదిరిగి చూడు
అడుగు ఇటువైపు వేసి
పలకరించి వెళ్ళవోయ్ రాకుమారా...