అద్దంలో అగుపించానేమో
అతని నమ్మికకు కొలమానం ఏమిటో
మనసు రహస్యపు అరలోని మాటొకటి
ఒట్టైనా పెట్టించుకోకుండా అప్పగించాడు
ఏం చెప్పను
మనసు ఒక్కసారిగా మంచు ముద్దయింది
అతని నమ్మిక నన్ను పొరలు పొరలుగా కోసేసింది
కన్నీటి సముద్రం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది
ఏం చేయను
విలువ కట్టలేనిదేదో హస్తగతమైనట్టుంది
చెప్పలేని కథ సొంతమైనట్టుంది
తెలియకనే కాస్తంత వెనకడుగు వేసినట్టుంది
అలవోకగా
ఆకాశమంత ప్రేమిస్తున్నానని పదేపదే చెప్పేమాట
రెక్కలు కట్టుకొని ఇపుడెక్కడికి వెళ్ళిందో మరి
ఓయ్ ...
ఇంతకూ...
ఇంతటి ఆపురూపానివి
ఎప్పుడయ్యావోయ్ ...❤️
నీపై ఇష్టాన్ని చెప్పడానికి
మాటలేవి సరిపోవడం లేదిపుడు