వెలుగు చీకట్ల సమయాన
ఎగుడు దిగుడు తోవలో
తెలియని మలుపుల మధ్య
అద్భుతాలేవో
ఆవలివైపున ఉన్నాయని అడుగులేసిన క్షణాన
నా ముందూ
నా వెనుక ... నా నీడన
మొత్తంగా నాతో ఉన్నట్టనిపిస్తుంది
ఒక్కసారిగా
ఓపలేని మనసు బావురుంటుంది
అణువణువు అల్లుకున్న నీపై
మరింత ప్రేమ ముంచుకొస్తుంది
వెన్నెల దోసిట్లో అందించినట్టు ఉంటుంది
సముద్రం పూర్తిగా నన్ను తడిపినట్టుంటుంది
కొండగాలి దారితప్పి నన్ను చేరినట్టుంటుంది
నమ్మలేని అపురూపాలు నక్షత్రాలై రాలినట్టుంటుంది
ఓయ్
ఎంతైనా ...
నువ్వు భలే మంచివాడివోయ్
నేను వెళ్లే త్రోవలో
జారుముడిలా నువ్వెలా చిక్కుకుంటావో...