విడవలేని పంతం ఏదో వస్తుంది
పనిగట్టుకుని పలకరించడం మానేయాలనిపిస్తుంది..
పనిలేని పనులన్నీ కుప్పగా పోసి
సమయం లేదని సాకు చెప్పాలనిపిస్తుంది..
ఏమైనా సరే నా నుంచి దూరంగా
దారి తెన్నూ లేని ఊరి వైపు తరిమేయాలనిపిస్తుంది..
ఒకటా రెండా ఎన్నెన్ని చెప్పేది...ఎన్నని చెప్పేది....
అయినా...
ఏమనుకుంటే ఏముందిలే
బుద్ధిలేని మది
ఎపుడెళ్ళిపోయిందో అతని వెనుక
మాట మాత్రం చెప్పకుండా
ఓయ్
అందుకే చెప్పేది ...
నమ్ము ...నమ్మకపో
నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు