నాకు అంతా ఖాళీ సమయమే
నీకు తీరికలేని పనులాయే
సమయం ఎంతకూ గడవడం లేదు
ఏం చేద్దాం మరి...
ఊ.. మాట
నా పాటికి నేను మాటలు చెబుతాను
నీ పాటికి నీవు వినకుండా వెళ్ళు
ఓయ్
మాటలు ఎటు చేరుతాయో
అంతుచిక్కదు కానీ ...
ప్రేమ మరింత
చిక్కపడడం మాత్రం నిజమోయ్