నాకు ఇక్కడ ఉండాలని లేదు
ఇలా ఎన్ని వేలసార్లు అనుకున్నానో
తలచుకున్నా
కలవలేనంత దూరానికి
తప్పుకుపోతే బాగుండని ఎన్నిసార్లు అనుకుంటానో
కలవరపెట్టే పెద్ద కారణాలేమీ లేవు
తలుచుకున్నా ఎదురుపడనప్పుడు
ఎదురుపడినా మాట్లాడనప్పుడు
ఇంకా ఇక్కడే ఉన్నానేమిటని అనిపిస్తుంది
ఇందులో
తప్పుపట్టాల్సిన నేరాలేమి లేవు
తప్పంతా నాదే
సమయానికి లెక్కలు వేయక
అతన్ని దాచాలనుకున్న పేరాశ
అతనేమో సమయమే లేదంటూ
సమయంలో చిక్కుబడిన... ఓ మబ్బుతునక
Please...ఓయ్
సమయాన్ని మరచి
నాకై ఒకింత చినుకై రాలకూడదూ