నీలంపూవు..

అందరితో
అనువైన అనుబంధమేమీ లేదు
తడవ తడవకు తలుచుకునేదీ లేదు
చెప్పి వెళ్లిన వాళ్ల మీద ప్రేమేమీలేదు
చెప్పక తప్పుకున్న వాళ్ళపై అలకేమీలేదు

ఎవరో...కొందరుంటారు
పువ్వులా అనిపిస్తారు
పెనవేసుకోవాలన్న ఆశ కలిగిస్తారు

ఒకానొక సమయాన
నీలంపువ్వు నిశ్శబ్దంగా రాలుతుంది
ఆ నిశ్శబ్దమే ...
నన్ను మరింత భయపెడుతుంది

జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్లుంటుంది
నాపై అధికారం ఎవరో అందుకున్నట్లుంటుంది
నా నుంచి నన్ను వేరు చేసినట్లనిపిస్తుంది


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!