నువ్వెందుకు నచ్చావంటే

నువ్వెందుకు  నచ్చావంటే
ఏమో ...

నీపై
చుక్కలన్ని మెరుపులు అద్దాయేమో
పూలన్నీ పరిమళాలు వెదజల్లాయేమో
ఏమో నాకేం తెలుసు

ఏమో
ఎలా పోగు పడుతుందో మరి
రోజుకొక కొత్త కారణం
నిన్ను మరింత ప్రేమించడానికి

నువ్వొక
రంగుల ఆకాశమని
నా అరచేతిలో సముద్రమని
గుసగుసగా నా మది మరి మరి చెపుతోంది
ఏమో నిజంమెంతో నాకేం తెలుసు

ఓయ్
తెలియని పొడుపు కథలా ఇంకా మిగిలే ఉంది
తెలిస్తే ... చెప్పరాదూ


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!