నా నుంచి పలకరింపు లేకపోతే
ఆలోచనలన్నీ పోగేసి నాకై వెతకడానికి
నువ్వంటే ఇష్టమంటూ మరీ మరీ అంటుంటే
నా కోసం దాగుడుమూతలు ఆడడానికి
మనసారా ఓయ్ పిల్లా అని
మనసాగక పలకరించడానికి
నీకు అసలు టైమ్ ఉందా
బిజీ బిజీ పనులతో ఉన్న నీవు
నా నుంచి తప్పుకోవాలనుకోవడంలో తప్పేమీ లేదులే
ఎంతైనా విసిగించడంలో
నేను సిద్ధహస్తురాలినని నిక్కముగా ఒప్పుకుంటాను
ఇక మొదలెట్టు మరి...
నిన్ను వదలుకోలేనితనాన్ని గేలిచేయి
నిన్ను మర్చిపోమ్మని హద్దుగీయి
చివరాఖరికి నన్ను కాస్తంత దూషించు
నేను తప్పుకోడానికి ఖచ్చితమైన దారివెయ్యి
ఓయ్
ఇంతకూ ఇవన్నీ చేయడానికి
అసలు టైమ్ ఉందా...
ప్రేమంటే
టైం లేకపోవడము కూడానా