సమయపు దారంతో

చిరునవ్వులు విరబూసిన వేళ
మగత కన్నులతో కలలుకనే వేళ
వద్దనుకుని విసిరేసే క్షణాలు
నాకు అరువు ఇవ్వరాదూ...

తెలియని దారిన వెళ్లే వేళ
నలుగురి మధ్యన ఉన్న వేళ
రహస్యంగా దాచిన క్షణాలు
నాకు అరువు ఇవ్వరాదూ

ఒంటరితనం వచ్చి చేరిందంటూ
మనసు గాయాల పాలయ్యిందంటూ
తల్లడిల్లే సమయాన.. .
నిన్నంటి పెట్టుకున్న  క్షణాలల్లో 
అచ్చంగా నీవైన కాసిన్ని  క్షణాలు
నా వైపు విసిరేయరాదు...

ఓయ్
అందుకున్న క్షణాలతో
నిన్నేమీ ఆరడి పెట్టనులే
నిక్కముగా అబద్ధపు నిజమేలే

అయినా
అవన్నీ పోగేసిన నక్షత్రాలే కదటోయ్
మరి...సమయపు దారంతో వరమాల అల్లనా


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!