దూరంగా ఓ పాట
నాకై వచ్చినట్టు ...అంతా తానైనట్టు
ఆకాశంలా అల్లుకుపోయింది
ఎన్ని వేల క్షణాలు గడిచాయో
మగత నిద్ర నుండి మేల్కొన్నట్టు
ఒక్కసారిగా మనసు ఉలిక్కిపడింది
ఎందుకనో...
అదే పాట అప్పటి పాటే
సమయపు పడవలో
దూరతీరాలకు వెళుతోంది
నిశ్శబ్దపు పాటను నా చెంత వదిలి
ఒప్పుకోనని... తప్పుకుపోనని
మంకుపట్టుతో తన వైపు సాగే
చిక్కటి చీకటిని హత్తుకున్నాను
కనిపించని రంగులను అద్దుతామని
చిత్రమే...ఇపుడు
అంతా అతనై కనిపిస్తున్నాడు
ఓయ్
మగత నిద్ర క్షణాన
వచ్చి చేరింది నువ్వే కదూ...