ముళ్లపొద తెరచాటున

మా యింట
పూల మొక్క ఒకటి
ఎందుకో
ముళ్ళ పొద అవుతోంది

నేర్పు
తెలిసిన మనిషి

మాట గుచ్చిపోయాడో
మనసు విరిచిపోయాడో

ఎపుడు వచ్చి వెళ్ళాడో
ఏ రెమ్మ తెంపిపోయాడో

అయినా
ముళ్లపొద తెరచాటున
పూలు పూస్తూనే ఉన్నాయి
నీకోసమేనంటూ ....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!