కథ పయనం

అతను ప్రేమించానన్నాడు
నవ్వుతూ సరెలే అన్నాను ....

కొన్నాళ్ళకు
అతను కాస్తంత గట్టిగానే చెప్పాడు
ఐ లవ్ యు అని
సరే అనలేక సరే అన్నాను.....

చాన్నాళ్లకు
చెప్పేది అర్థం కాదా
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
కాస్త విసుగు విసురు కలిపి చెప్పాడు

ఎంత చెప్పినా అర్థం కాదు
ఐ హేట్ యు అన్నాడు
ఇప్పుడు
స్వేచ్ఛగా సరే అన్నాను...

*****

ప్రేమించి మోసపోయానని
ఊరువాడ కథలల్లుకున్నాయి

మోసం  ఎప్పుడు ఎలా
ఎవరికి జరిగిందో... మరి
ఇంకా ... అంతు పట్టలేదు
కథ పయనం కొనసాగుతూనే ఉంది..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!