నా ప్రేమ కలల సాక్షిగా

కొందరు ఉంటారు....
ప్రేమిస్తున్నానంటూ
ఈర్ష్యా అసూయాలను
చంకనేసుకు తిరుగుతారు...

ఎదురుపడిన మనిషిని
అపురూపమంటూ
బందిఖానాలో వేసి
ప్రేమించమంటారు...

తన చుట్టూ ఉన్న ఎత్తైన గోడలను
ఎదుటివారి వైపు జరుపుతూ
ఇరువురము ఒకటే కదా అంటూ
దుఃఖపు మాటలు అరువు తెచ్చుకుని
తన అనురాగపు ప్రేమలో మునగమంటారు

ప్రేమిస్తున్నారా
తనను ప్రేమించలేదని ప్రశ్నిస్తున్నారా
ఇతమిద్దంగా  తెలియని
ఓ రహస్యపు కథను రచిస్తూ
కాలానికి కథలు నేర్పుతున్నారు...

కళ్ళు ఎందుకో
తడవ తడవకు తడి అద్దుకుంటుంది
ఇంకా మదిపై ఆరని తడిచారికలు
గాయాలుగా ఉండిపోతాయి ఎందుకో...

ఓయ్
నిశ్చయంగా నిజం చెప్తున్నా
కాలానికి నేర్పే ఆ రహస్యపు కథలో
భాగస్వామిగా నీవెప్పటికి ఉండబోవని ...
నా ప్రేమ కలల సాక్షిగా
నిజమని ఒట్టేసి చెబుతున్నా...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!