నిశ్శబ్దపు గీత చెరిపి పోరాదు...

Disturb me ...
Hey ... hello
Why don't you disturb me ...

నిశ్శబ్దం నిలకడగా ఉండనంటుంది
నాలో అణువణువు ఇంకిపోతూ
ఒదిగిపోతానంటుంది ...

అతన్ని తనలో కలుపుకుంటూ
చిత్రాలెన్నో గీస్తుంది ...

మాటైనా పలకని వాని భావాలను
వడసి పట్టుకుంటుంది ..
అయినా  ...  ఎందుకో
లోలోపల ఓ గుబులు లోకాన్ని
తీర్చిదిద్దుతుంది తెంపరితనంతో

ఏదేమైనా
అలవాటయిన మాట వదిలి
నిశ్శబ్దపు కథ రాయడం
ఒకింత కష్టమేనోయ్ .,.

ఓయ్
రారాదూ
వినబడే ఓ మాట విసిరి
నిశ్శబ్దపు గీత చెరిపి పోరాదు...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!