నిదురపోని
కాసేపు ఆమెను
అలా నిదురపోని..
ఆకాశమంత ప్రేమించే ఆమెకు
చుట్టూ మౌన యుద్ధాలు ... మారణహోమాలు
మనసును గిల్లి గిల్లి గాయం చేశాయేమో
రావణకాష్టంలా ద్వేషం రగిలి పోతుంటే
ప్రేమించాలో .. ద్వేషించాలో
తెలియని నిశ్శబ్దంగా
నిలిచిపోయిందేమో....
ఒక్కసారిగా
తనలో తాను ముడుచుకుంటూ
ఎవరికి అందని చీకటివైపు
పయనిస్తూ పయనిస్తూ
అలసిపోయిందేమో
ఒకింత ఒరిగింది
నిదురలో ..
కరిగిపోతుందో
రాలిపోతుందో
అయినా కదపకు ...
నిదురపోని
కాసేపు ఆమెను
అలా నిదురపోని...