నేను కాలాన్ని వెంటేసుకుని
పచ్చికబయళ్ళ వెంట బయలుదేరుతా
అప్పుడప్పుడు అతను శిఖరమై
ఎదుటనిలిచి నన్ను వడసిపడతాడు
అతన్ని అల్లుకుంటూ
అతని నిశ్శబ్దాన్ని
శబ్దంగా మారుస్తూ
జలపాతాన్నవుతాను
ఓహ్ ...
అపురూపాలన్నీ అతనితో మొదలై
అతని కోసం వేచి ఉంటాయి
అతనో అద్భుతాల సృష్టికర్త
నిజం చెప్పు
తప్పిపోయిన నువ్వు
నా ' నువ్వే ' కదూ