మరింత ' ఊ ' కొడుతూ

కదిలే కాలంలో అతను
నా వెనుక అడుగులు వేస్తూనే ఉన్నాడు

అతనితో పంచుకునే మాటకి 'ఊ ' కొడుతూనే ఉన్నాడు..
వెనుతిరిగి చూడక నేను నడక సాగిస్తూనే ఉన్నాను

ఒకానొకసారి
అలుపువచ్చి ఆగి..వెనుతిరిగి చూసాను
జాడ కనబడలేదు.. అనంత దూరం వరకు

ఎప్పుడు ఎక్కడ అడుగు ఆగిపోయిందో
అయినా అతను 'ఊ ' కొడుతూనే ఉన్నాడు

ఆగిన నడక మొదలుపెట్టబడింది
నేను చెబుతూనే ఉన్నాను
అతను 'ఊ '  కొడుతూనే ఉన్నాడు
ఇపుడు మరింత దగ్గరగా.....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!