ప్రియ శత్రువు


రాతిగోడల మధ్యన వదిలేసి వెళ్లాను
మనుషులు తిరగాడని చోట రాల్చేసి వెళ్లాను
చివరాఖరికి పూలవనంలోనే కదా పాతేసి వెళ్లాను

అయినా
నేను వెళ్ళిన ప్రతి చోటికి
నాకంటే ముందు చేరిపోతావెందుకు
అయ్యోపాపం అని నన్ను అందరూ
అంటుంటే సరదానా నీకు

నా నుంచి తప్పుకోమని ఎన్నిసార్లు చెప్పాలి
సిగ్గుమాలినతనం అరువు తెచ్చుకున్నావా
నా చుట్టూ లక్ష్మణరేఖలు గీస్తున్నావు

ఎవరు నువ్వు
రాలిపోయిన జ్ఞాపకానివే కదా
వీడి వెళ్ళననే తలబిరుసు
పెంకి కలవే కదూ..

ఏది ఏమైనా
ఇటు అడిగేయకు
నా దరిచేరకు

ఓ ప్రియశత్రువా
నన్ను ఇలా ఉండనివ్వు
కొంతకాలం .. మరి కొంతకాలం


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!