ఓయ్.. ఏమంటావ్

ఓయ్...ఏమంటావ్❤️

నువ్వు నేను ఒకేసారి ఒకేవైపుకు
అడుగులు వేయడం మొదలుపెట్టి ఉంటాం
కాదని అనడానికి కారణం లేదు
నేను లేకుండా నీవు ఉంటావన్న ఊహయే లేదు

నాది సొగసరి మనసు కనుక
నీకోసం ముందుగా రహదారి వేస్తాను ...
అప్పుడప్పుడు
నీ చక్కని మనసు చిక్కుకోడానికి
కొన్ని రంగుల పూలు కూడా పరుస్తాను...

ఎప్పుడో ఒకసారి
నీ మీద బెంగ అంటూ సాకు ఒకటి చెప్పి
కనబడని నీ ఆనవాలు వెతుకుతూ
రహస్యంగా నీ నీడలో ఒదిగిపోతాను

నీ చెంత దాగుడు మూతలు ఆటలు ఆడడంలో
కొంచెం తెంపరితనాన్ని మరికొంత నేర్పుని
నా గడసరితనంతో సంపాదించాను కదా..

నా చెంత బంధింపబడ్డావని తెలియడానికి
మరి కొంత సమయం పడుతుందిలే నీకు..
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!