మాటలు నేర్చాడు కొత్తగా....

నా మృదువైన గులాబీ సోయగపు అతను
కొత్తగా మాటలు నేర్చుకున్నాడు చూడు

అతను లేచే వేళకి
నా అలిగిడి  వినబడుకుంటే
అతని మది కలవరపడుతుందట

అతను వచ్చేవేళ మించిపోతే 
నా వడలిన మోము గుర్తొచ్చి 
ఊపిరి ఆడినట్టు ఉండదట

నేను మౌనంగా ఉంటే
అతను మాటలే మర్చిపోతాడంట

నాలో ఇసుమంత కోపం కనిపిస్తే
అతను ఒంటరినని బెంగ పడతాడంట

అబ్బో
ఆకాశమంత దూరంలో చందమామ లాంటి అతను
ముద్దు ముద్దుగా ఎన్ని కొత్త మాటలు నేర్చుకున్నాడో

అంతేలే  మరి....
ఏ ఊరి మహరాజో అని నేను అంటుంటే
ఈ నగరపు రాకాసికి ఊహలు నేర్పాలని
తనలోని మృదుత్వం  నా మీద కాస్త వెదజల్లాలని
అనిపించడం ఒకింత సమంజసమే...

ఆరాధన అందుకునే
నా మృదువైన నెమలీక అతను
నా వెనుక అడుగేస్తానంటే
ఒప్పుకునేది ... ఓర్చుకునేది ఎలాగ
అనుమతి ఇవ్వడం కుదరదే మరి ..

ఏమీ చేయనూ ....
మురిపెంగా చెప్పనా .. మృదువుగా చెప్పనా
కర్ర పెత్తనం చేయనా.. కరకుగా ఉండనా
తనది కాని బాటలోకి అడుగేస్తే
చూస్తూ ఎలా ఉంటాను....మరి


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!