మనసు నమ్మింది మనసారా

సుదూరపు నడకతో
బయటకు వచ్చాను...
ఎవరికి అడ్డు లేకుండా
వీధిలో  నించున్నాను...

సమయం గడిచిపోతూనే ఉంది
ఆ దారిన ఎందరో సంశయిస్తూ
వెనుదిరిగి చూస్తూ వెళుతున్నారు
ఎవరి నుంచి ప్రశ్నింపబడలేదు

ఎంతో సమయం గడిచిపోయింది
ఎవరో దారిన వెళుతూ అడిగారు
ఏమైంది......

ఎదురుచూస్తున్నా
జవాబు ఇవ్వబడింది....
అంతటితో సంభాషణ ముగిసింది

ఏదైతేనేం..చివరాఖరికి
నా చుట్టూ మనసున్న మనుషులు ఉన్నారని
మనసు నమ్మింది మనసారా.....

నేను నిశ్శబ్దంగా నిశ్చలంగా
ఇంటి వైపు నడక సాగించాను.....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!