నీవు నించున్నచోట
ఆకాశం తివాచి అవుతుంది
మౌనం కూడా
మోహపు గీతాలు పాడుతుంది
******
నీ పెదవి వంపులోని చిరునవ్వు చెబుతుంది
నా రహస్యఅంతరంగాన్ని చేదించే చూపు చెపుతుంది
మదినుండి నా ఆనవాళ్లను చెరిగిపోలేదని..
******
నీ మనసుని రోజు అద్దంలా తుడుస్తుంది.....
నా (మది) ఆనవాలు కోసం కాబోలు
*****"
మౌనంగా ఉన్నానని
రంగుల కాగితపు పడవ చేద్దామంటూ...
వర్షపు చినుకు వచ్చి చేరింది జతగా
******
నీ అడుగుల ఆనవాలు కనిపించక
నా నీడ మీ ఇంటి తోవ పట్టింది
*****
నీకై వెతుకుతూ...
నీలో నేను... నాకై నేను... బంధింపబడ్డా