ఏమోయ్...
నీవు చిరుగాలివై నపుడు
రాలిన విరజాజినపుతా
నీ పాదాలు ముద్దాడ
నీవు వానచినుకైనపుడు
విరిసిన గులాబీనవుతా
నిను ఒడిసిపట్ట..
నీవు మెరుపైనపుడు
ఎత్తైన కొండ చరియనవుతా
నీ చేయి అందుకొన..
నువ్వు గాఢ చీకటైనపుడు
మెరిసే మిణుగురు నవుతా
నీ చెంత చేరుకొన
కానీ.. ఎందుకో..
నీవు సముద్రం అయినప్పుడు
ఒడ్డున నిశ్చలంగా కూర్చుంటా
నన్ను నీకు ఒప్పగించి
ఇది కథ కాదు
కల కానేరదు
ఏమోయ్.. నిజమే కదా
నన్ను బంధించిన
నీ జ్ఞాపకాలు సాక్షిగా....