మోహపు గీతాలు

రాత్రి కలలను జారవిడిచిన వేళకి
అతని మాటలోని మృదుత్వపు లాలన
విరజాజి తీగలా... మరువకు సోయగంలా
నా నుండి ఇంకా విడివడనే లేదు..

వేకువజాము ఊహల్లో
సున్నితపు ప్రేమమగతలో
అతను వచ్చాడు....

ఎందుకో......
అతన్ని అల్లుకుపోవాలన్న తలపు
ఘాడత దరిచేరకముందే
నా అడుగువెనకకు వేస్తుంది
ఆనవాలు వదలకుండా

అయినా....
నాలోని వర్ణచిత్రపు రంగులు
అతనిలో వెదజల్లే బడ్డాయి కాబోలు
పగటి  నిశ్శబ్దపు కాగితంపై .. మది
రాత్రి మోహపు గీతాలు ఆలపిస్తుంది
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!