ఓ నిజం - జ్ఞాపకంగా

ఎప్పుడో
అతని మనసు
అణువణువు
మల్లెల సౌరభంతో
నిండిపోయింది......

చోటులేదక్కడ....ఇసుమంత
నీకు నచ్చితే ఏం
నీవు మెచ్చితే ఏం
నీవు తెచ్చిన మల్లెపూవు
వాకిటనే జారవిడువు...

అచ్చంగా...
నీలోని అతన్ని
మరగుపరచి
మరిచినట్టు....

ఓ నిజాన్ని
జ్ఞాపకంగా మలచి
మదిన దాచడం
తెలుసుకదా....
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!