నువ్వు మౌనంగా ఉంటావు
ఎందుకో
నా మనసు సంద్రవుతుంది
అయినా
ఓదార్పు పలకనెందుకో..
నాలోన తేనె తలపులు వదిలి
నీవు వెనుకడుగేస్తావు
అయినా
ఓదార్పు పలకనెందుకో..
తీరికలేని సమయాన
ఎందుకో
కలవరపు మనసుతో
నీవు వేచి ఉంటావు
అయినా
ఓదార్పు పలకనెందుకో..
ఎప్పుడో.....
నావైపు అడుగు లేస్తావు
అయినా
పరుగున వచ్చి
ఓదార్పు పలకనెందుకో....
బహుశా
నీ మౌనానికి
సంద్రం అయిన మనసు
తుఫాను తాకిడికిలో
చిక్కుకుంది కాబోలు...