అతడు సమూహం
నుండి తప్పిపొయాడు
దూరంగా వెళ్ళసాగాడు
బుద్ధుడి మౌనంలా...
నేను అతని ముందు వాలాను
చిన్ని పిట్ట విన్యాసాలతో
ఆకుపచ్చని గడ్డిపరకల
గూటిలోకి పిలిచాను..
అతని చూపులు నావైపు వదిలి
అతను చిక్కని అడవిలోకి
కనబడకుండా వెళ్ళాడు
బహుశా
జత సరిపోలేదేమో
అతనో అడవి పిల్లి
నేను ఊరపిచ్చుకను..
అయినా..
నేను అల్లిన ప్రేమ బంధం
సుదూర తీరాలు తాకింది
చిక్కుబడ్డ రంగుల దారాలతో..