నీలి సంద్రం సిరా

నీలి సంద్రం సిరాతో
చిరుగాలుల సంతకం చేసి
ఎదురొచ్చిన కాలానికి ఇచ్చా
ఉత్తరం.... ఓ ఉత్తరం

ఏమోయ్
కాలం ఒడిలో తిరుగాడి
నీ చెంతకు చేరే ఉంటది
ఎపుడో..... అపుడో

ఆనవాలుగా ఓ చిరునవ్వు
నా పెదవిని తాకింది ఇపుడు..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!