నీ ప్రేమ (మినీ కవితలు)

నదీ తీరాన ఓ పూరి గుడిసె
నీ చోటు ఆనవాలని ..
వారు.... వీరూ....చెప్పారు

తీరా వచ్చాక తెలిసింది
దాని సొంతదారుని నేనే నని..

*******************(11/8/2021)

అనురాగమేలనో
భారమాయే..

నాలోని నిన్ను
వదిలేయ
మనసాయే...

******************(13/9/2021)
గుప్పెడు మనసుకీ
గంపెడు మమకారాలు ఏలనో...
ఈ తికమక లెక్క ఏమిటో...

లెక్కలు తెలిసిన మనిషికి
ఆరాలు ఎక్కువే
అనుమానాలు ఎక్కువే

లెక్కలు తెలియని మదికి
చింతలు ఎక్కువే ...
మమతలు ఎక్కువే...

*************************(15/9/2021)

మౌనం అలికిడి చేస్తోంది...
మాటలతో నిదుర పుచ్చమని
వేకువ చీకటిని తోడు రమ్మన్నట్టుగా...

************************(16/9/2021)


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!