నా లోని నీవు ( మినీ కవితలు)

నీ ఆచూకి కనుమరుగైన..
బంధం బలహీనమైనా...

నా కోసం నీవు
అనే ఊహనే....

ఎందుకో
నా మనసును
క్షోభ పెడుతోంది.......

*******************(2/2/2021)

వేళ కాని వేళ
ఎందుకో గుర్తొచ్చావ్..

అందమైన
అబద్దం కాబోలు...

అసలు నిన్ను
మరచినదెపుడని...

*****************(5/2/2021)
అతని ఎదుట
రిక్త హస్తాలతో
నించున్న.....

దారి తెలియని
విలువైన సంపద
చిరునామా అదే కాబోలు...

*****************(22/2/2021)

నిన్న.. నేడు.. రేపు
అన్ని ఒక్కటయ్యాయి ..

అందులో ....

ఎక్కడో నేను
నీకై వెతుకుతూ...

*********************(24/2/2021)

ఎన్నడూ లేనిది...ఎందుకో
నీ పేరు పదే పదే రాస్తున్నా

బహుశా....

నిన్ను మరవలేదని
నా మనసును
బుజ్జగించడానికేమో...

**********************(27/2/2021)
అతను మాయమయ్యాడు
చెప్పకుండానే తప్పుకున్నాడు

నేనెక్కడో.....

బంధాలతో అనుబంధాల
చిక్కుముడులు
వేసుకుంటున్నప్పుడు....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!