ప్రేమ సంకెళ్ళు (మినీ కవితలు)

నీ చిరునామా తెలియని చోటికి లేఖలెన్నో రాశాను...
తిరుగుటపాలో  ప్రేమవర్షం ముంచేసింది
నీ ఆనవాళ్లు లేని చోట నీ ప్రేమ ఎలా చేరిందో....

**************************(22/3/2021)

నేను లేని చోట
నాది కాని చోట
నాకు నేనుగా
బంధించబడ్డ
ప్రేమ... సంకెళ్ళతో

***********************(27/3/2021)

నిన్న ఏమయిందో
రేపు ఏమవుతుందో
అయినా ....
కాలం లెక్కింపు
కొనసాగిస్తూనే
ఉన్నా నీకోసం....

***********************(3/4/2021)
నీ కోసం దాచిన మాటలు
విసిగి వేసారి
కరిగి నీరైపోయాయేమో..
అవసరానికి ఒక్కటి
కూడా మిగలలేదు....

*********************(5/4/2021)


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!