అతను (మినీ కవితలు)

సంకెళ్ళతో బంధింపబడిన
ఆమె మెరిసే కళ్ళతో అడిగింది
స్వేచ్ఛ అంటే ఏమిటని..

తడుముకోకుండా
అతను అన్నాడు
నీ చిరునవ్వే అని...
_______________(19/1/2021)

నువ్వు తెలుసు
ఏళ్ళు.. ఏళ్లుగా

అయితేనేం...

మొదలు పెట్టిన
ఉత్తరానివే ...
ఇప్పటికీ...
*********************(22/1/2021)
దాగుడుమూతలు ఆడే
మనసుకి
కళ్లెం వేయాలంటే

ప్రణయమో... ప్రళయమో
దరి చేరాలి

లేదంటే

యోగినో...భైరాగినో
అయ్యి తీరాలి

*****************(25/1/2021)

బంధం తెంచుకుంటే
మరుగునపడతావా
మరిచిపోతానా...
.
నీ జ్ఞాపకాలకు
కొత్తరంగులద్ది....

మరువలేని
బంధంతో
మది నింపనా.....

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!