నాలోని - నీవు (చిన్న కవితలు )

వెన్నంటి ఉన్న 
నిన్ను చూసాకే తెలిసింది....

అలవిగాని కలలు
అరచేతిలో అందమైన జ్ఞాపకాలై
ఎలా  నిలిచాయో...

********************

మరువపు వాసన
ఇల్లంతా అలుముకుంది
నీకై వెదుకుతూ.....

***********************
చేజారిన కాలిపట్టా
ప్రపంచ యాత్రకి వెళితే...

కినుక పూనిన కాలు
నడక మానేసింది.....

************************

ఎందుకో ఈవేళ
ఎదురుపడి
పలకరిస్తున్నారు..

బహుశా..

నాకు నీతో
స్నేహం కుదిరిందన్న
ఆనవాలు చిక్కింది కాబోలు..

*******************************

ఎన్నో  మాటలు
పలువురికి పంచేశా....

మనసులో మౌనంగా
కొన్ని దాచేశా
అచ్చంగా నీ కోసం....

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!