మినీ కవితలు -- ముగ్ధత్వం

నిజాలన్నిటికి బ్రతుకు తెరువు
కరువయ్యింది కాబోలు...
అబద్ధపు ముసుగు
అరువు తెచ్చుకుంది..

***********

రాత్రి లోని ముగ్ధత్వం 
కలయై జోకొట్టింది కాబోలు....
 
చిరునవ్వుల వేకువ వేచివుంది
విరిసిన మోముకి హారతినివ్వ....
 
***************
విరబూసిన చెట్టు నీడన
గుబులును పాతిపెట్టి వచ్చా
 
అదేమి చిత్రమో
చీల్చుకుని వచ్చి మ్రానై
తన నీడకు రారమ్మని పిలిచే.,
 
****************
 
బంధాలు .. బాంధవ్యాలు 
వినడానికి ఇంపుగా....
నిలుపుకోడానికి కష్టంగా ...
 
అయినా...
కాలదన్నుకోకున్నా...
కావాలనుకున్నా....
కాలం ఒడిలో కనుమరుగైతాయి..

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!