జీవన సాగరం ....

కష్టాలకు కనికరం లేని క్షణం  కనురెప్ప కదలదు ఎందుకో ?

నీ ఇష్టాలకు విలువ ఉండదు, నీ మాటకి స్పందన ఉండదు,

నీ దగ్గర ప్రశ్నకు జవాబు ఉండదు, నీ  ప్రాణానికి విలువా ఉండదు ,
నీ బంధాల వలయాలకు శక్తే ఉంటె, నువు చేసిన మంచికి విలువే ఉంటె,
కన్నవారి  బంధాల  కన్నీటిలో ఈ పాటికి కొట్టుకు పోయేది ఎప్పుడో ....
బ్రతికే అర్హత కోసం , చితిమంటల జ్వాలలు కనిపించకుండా పోయేవి ఎక్కడికో....

కాదని జీవిస్తున్నావంటే , ఆ రహస్యాన్ని ఎవరూ చేధించలేరు ఎలాగో ,.....
నిజాన్ని గుర్తించు ,  .... నిన్ను  బ్రతికిస్తున్నారు ఎవ్వరో, ఎందుకో?


నిన్ను ఆనందంగా అనుభవించే వారో ? సంతోషంగా భరించేవారో ?
 

- నరేన్

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!