బాటసారి స్నేహం...


జీవితం అనే రహదారిలో  అడుగు పెట్టిన ఒంటరి బాటసారిని నేను...!

ఆ ఒంటరి ప్రయాణంలో తెలియని నీ పలకరింపుతో పయనం కొనసాగించితి  నేను...!
నా ఒంటరి పయనాన్ని నీతో జత కలిపి లక్ష్యం కోసం పరుగులు పెట్టెను  నేను...!

మన పరుగుల వేగంలో లక్ష్యాన్ని మరిచి
తీయని తీపి గుర్తులను, మరచిపోని మధుర క్షణాలను పొందెను నేను...!

లక్ష్యం కోసం మరో దారి లేక, నచ్చని ఒంటరి పయనం తిరిగి  మొదలు పెట్టెను నేను...!
అనుకున్న లక్ష్యాన్ని అందిన క్షణం వెనుతిరిగి చూసిన  నా  ప్రయాణంలో.....
ప్రతి అడుగు నీ జ్ఞాపకాలే, ప్రతి క్షణం నీ ప్రోత్సాహమే నేస్తమా...!


Comments

Post New Comment


PRASANNA 13th Dec 2013 04:08:AM

SUPER