ఒకానొక రోజు
హఠాత్తుగా వచ్చి
కొండగాలితో దరువు వేస్తాడు
నదిలో సముద్రపు అలలు సృష్టిస్తాడు
మది నిశ్శబ్దాన్ని దొంగిలిస్తాడు...
ఓహ్..క్షణంలో
కంటి ముందరి
చిత్రాల వలయం తారుమారవుతుంది
పూల తేనెదో
నిలువెల్లా తడిపి వెళుతుంది
ఓయ్
నువ్వేమైనా...
తెలియని వర్ణాల
కొత్త కథ మొదలు పెట్టావా