అప్పుడప్పుడు ఓ కల
రహస్యపు ముసుగు వేసుకుంటుంది...
మాయ చేసి
కలత నిదురలో అయినా కౌగిలించుకోవాలనుకుంటాను
కొన్నిసార్లు
ముక్కలు ముక్కలుగా విరిగిన కల
అతనిగా మారుతుంది
అతనేమో మడతపేజీగా మారి
వెన్నెల చినుకులా
కలను పెనవేసుకుంటాడు
ఓహ్
అంతు చిక్కని కల
కలత రేపుతుంది..కన్నుమూతపడనీదు
ఆరడి పెడుతుంది..అలజడి రేపుతుంది
ఓయ్
నిన్ను ఒడిసి పట్టిన కలను
కలత నిదురలోనైనా తాకి చూడాలనుంది