పాత కథలా
మాటల సందడి కరువైందేమంటూ
మబ్బు తునకల్లే ఓ మాట
అప్పుడప్పుడూ
నా ముందు వాలుతుంది...
ఇదిగో
ఇలా మాట ఎదురైనప్పుడల్లా
మనసు సముద్రపు అలల్లా
పొగిలి పొగిలి ఏడుస్తుంది...
అయితేనేం
నీ పలకరింపులు కరువై
మాటలు మౌనం వహించాయని
నిజం చెప్ప మనసు రాదు...
క్షణం తీరిక లేదంటూ
అబద్ధపు మాలతో
గడసరి బాట పట్టడం సులువే కదా..
ఓయ్
నిన్ను తప్పు పట్టనూలేను
నేను తప్పుకుపోనూలేను
కాస్తంత సమయం ఇవ్వురా
మౌనాన్ని ఒడిసిపట్టి ...మాటలు సారింప