అనగనగా ఓ కథ చెప్పనా...
అతనో మాటలసంద్రం
ఎక్కడెక్కడో మాటలకచేరి చేస్తుంటాడు
మాట మాటకి గుప్పెడు డబ్బులు వస్తాయంటాడు
కొండంత పోగేసి రారాజు అయ్యాడు...
అంతటి రారాజు ఎందుకో మరి
గొంతు తడారి పోయిందంటుూ
మాటలేవీ చెంత చేరడం లేదని
ఎప్పుడో సవ్వడి చేసిన నది కోసం
వెతుకుతూ దారి తప్పిపోయాడట...
అప్పటినుంచి ఇప్పటివరకు
ఒకానొకప్పుడు మాటల సంద్రపు రారాజు ఉండేవాడని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు...
ఓయ్
సమయమే లేదనే నువ్వు
కథగా మారుదామని ఆశపడుతున్నావేమో
అవన్నీ కుదరని పనులు కాని..
కాస్త ఇటు రావోయి
నాలుగు మాటలు చెప్పుకుందాం...