ఓహ్
చినుకు రాలితే
తడిసిపోయి వచ్చిన బడి రోజులు
కదిలి వెళ్ళిన బాల్యము
వదిలిన కాగితపుపడవలూ గుర్తొస్తాయి
ఊ..ఇంకా
విచ్చుకున్న మల్లెలు
సరిగమల చిరునవ్వు
ఎక్కడ నువ్వంటూ వెతికే
చూపులూ గుర్తొస్తాయి
అంతేనా..
మోమును తడిపే సన్నటి చినుకు
మెత్త మెత్తగా హత్తుకుంటూ...
అంతలో
జడివానై ఉక్కిరిబిక్కిరి చేస్తూ
దారంతా ఏరులా పారుతూ
కాళ్లను కదలక బందిస్తూ
అబ్బో
ఏమని చెప్పను
ఎంతని చెప్పను
ఓయ్
అచ్చంగా నీలా
మారాము చేస్తూ
ఆటలాడుతుంది చూడు...