నీవు...
నన్ను పిలిచినప్పుడల్లా
ఆకాశాన వేగుచుక్క పొడిచినట్టు
మంచుశిఖరంపై తేనె చుక్కరాలినట్టు
గడ్డి తివాచీ మీద మెత్తటి పాదం ఆనినట్టు
కంటి వెలుగులేవో మరో కొత్తదారి వేసినట్టు
అంతేనా
వెన్నెల నా అరచేత చిక్కినట్టు
సముద్రం నా ఒడిలోన ఒదిగినట్టు
ఓహ్
ఎంతని చెప్పను ...ఏమని చెప్పను
ఎంతెంత బాగుంటుందో ఎలా చెప్పను
ఓయ్ ...
నీ పిలుపుకి
కొత్తగా ....
రంగుల రెక్కల తొడుగొకటి
వచ్చి చేరిందేమో చూడు...