నేస్తం....

తడిఆరని ఇసుకలో నా అడుగులు
నిశ్చలంగా సాగిపోతూ......అల్లంతదూరాన చిరుసవ్వడి
నా అడుగులో అడుగువేస్తూ నా చిన్నారి నేస్తం....
సుదూరతీరాన ఓ దుస్వప్నం
అలజడితో అడుగులు తడబడ్డాయి.....
నా మనసు మూగబోయింది చిరుసవ్వడి వినిపించక
ఆరాటంతో వెనుదిరిగిచూసా...
తడబడిన నా అడుగులుజాడలు సరిచేస్తూ....
చిరునవ్వుతో తనూ.....


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!