~ కప్పుకుందాం రండి 'వెన్నెల దుప్పటి
తనూ ....
అతనూ .....
ఇరువురి నడుమనా
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే
అమలినమైన ప్రేమా
పుట పుటలో పరుచుకొని ఉందీ సంకలనంలో
అహమూ ...
స్వార్థమూ.....
'వ్యక్తి'త్వ వికాశమై అలరారుతున్న వర్తమానంలో
'ఆకాశపు హద్దు చెరుపుతూ
ఎంతైనా ప్రేమించొచ్చు'
అని భుజం తట్టే ఈ సంకలనం అత్యవసరం
ప్రతి ఒక్కడూ
లాభనష్టాల తక్కెడ చేబూని
బంధాలు అనుబంధాలు అల్లుకుంటూన్న తరుణంలో...
" ప్రేమ లోగిలిలో
అడుగుపెట్టి చూడు
నీ .... నా రేఖలు చెరిగిపోతాయి
ప్రేమ తప్ప మరొకటి కనిపించదని
ఆత్మ సాక్షిగా చెబుతున్నా
అనుసరించి చూడు...."
అని భరోసానిచ్చే ఇటువంటి కవిత్వం అత్యవసరం
ఇలా ...
ఉదహరించుకుంటూ పోవచ్చు
వ్యాఖ్యానించుకుంటూ పోనూ వచ్చు
ప్రతి కవితను
విందు భోజనంతా నేనే ఆస్వాదిస్తూ ఆరిగించేసి తృప్తిగా తేన్చేస్తే ఎలా ఈ షడ్రసోపేతమైన విందుకు మీరూ పూనుకోండి మరి. 'వెన్నెల దుప్పటి కప్పుకుని' కమ్మని కలలు కనడానికి సిద్ధపడండి మరి
- రత్నాజయ్ (పెద్దాపురం)