వెన్నెల దుప్పటి కప్పుకుందాం - హేమలత సామవేదుల

R. Rama Devi గారు ఆప్యాయతతో పంపిన వెన్నెల దుప్పటి,  అందుకున్నాను.
పొందికగా మడతలు పెట్టిన దుప్పటి ఒక్కో మడతలో విరజాజుల పరిమళాలు భద్రంగా దాచిపెట్టారు రమాదేవిగారు.
మడతలు జాగ్రత్తగా విప్పుతూ
పరిమళాలని ఆస్వాదిస్తున్నా.
'మరి అతనో
మృదుత్వపు రాగరంజిత
సముద్రుడు కదా'
అతని మృదుత్వాన్ని ఆమె పదాలలో నింపుకున్నారో లేక ఆమె కోమలత్వాన్ని తనలో నింపుకున్నాడో అతను మరి!
'అతను నేను
బొమ్మ బొరుసు
ఇప్పటికీ అర్ధం కానిది ఒకటే
నాణేనికి ఓకేపైపు ఎలా ఉన్నాం'
అతడు, ఆమె వేరుగా అనిపించినా
ఇరువురూ ఒక్కటే అన్న భావన !
ఇంత చక్కటి భావనలు పలికించాలంటే
ఎంతటి ప్రేమను మనసులో నింపుకోవాలో కదా!
Thank you రమాదేవిగారు
ప్రశాంతంగా ఒక్కో కవిత మళ్ళీ మళ్ళీ  చదువుతూ ఆస్వాదించవలసినవి


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!