ఎడ్యురప్ప రాజీనామా

ఎడ్యురప్ప రాజీనామా
లోక యుక్త  కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కర్నాటక ముఖ్య మంత్రి ఎడ్యురప్ప ని పదవి నుంచి తప్పించడానికి రంగం సిద్ధమైంది. ఎడ్యురప్ప  పదవి కాలమంతా బల పరీక్ష ల తోను , తన పదవి ని కాపాడుకోడం లోను గడిచిపోయింది. కర్ణటక గవర్నర్  రామేశ్వర్ ఠాకూర్ తో తెర లేపిన నాటకం ఎట్టకేలకు చివరి దశకు చేరి, కాంగ్రెస్ కల నిజం కాబోతుంది.
కర్నాటక లో బిజేపి అధికారం లోకి రావడం తో  ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి అన్ని ప్రయత్నాలని చేసింది కేంద్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. MLA లని కొనటం , వాళ్ళ ని అడ్డం పెట్టుకొని బల పరీక్ష కి ఆహ్వానించడం,ఎడ్యురప్ప గెలవడం. ఇలా పలు సార్లు జరిగింది. ఎవరి అనుమతి లేకుండా , గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ రాష్ట్రపతి పాలన కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, అది కూడా చివరికి హాస్యాస్పదం అయింది. ఎడ్యురప్ప ఇన్ని పరిక్షలకు నిలబడి తట్టుకోగాలిగారు. ఇక చివరగా అవినీతి అస్త్రాన్ని సంధించింది. ఆంధ్ర ప్రదేశ్ లో Y S CM గా ఉన్నప్పుడు "గాలి" సోదరులకు ఇనుప ఖనిజం గనులను అప్పనంగా, ఇంకా చెప్పాలంటే చట్టాలను అతిక్రమించి దోచింది కూడా ఈ ప్రభుత్వమే. ఇప్పుడు అదే పని అవినీతి గా కనిపించింది. అవును , అవినీతి జరిగింది . ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గా ఎడ్యురప్ప  రాజీనామా చేస్తున్నారు.
మరి ఇన్ని లక్షల కోట్ల కుంభ కోణాల్లో మునిగి తేలుతున్న కేంద్ర ప్రభుత్వం లో ఎవరు రాజీనామా చేయాలి. ప్రధాన మంత్రా? సోనియా నా (ఎందుకని అడక్కండి , సోనియా నే ప్రధాని చాల మంది అనుకుంటారు.)?, చిదంబరమా? ఎవరు ?
2 జి స్పెక్ట్రం కేసు లో రాజ ని బలి పశువు ని చేసి , తమ చేతులు దులుపుకుంది. నిన్న జరిగిన న్యాయ విచారణ లో "ఇదంతా ప్రధాన మంత్రి అనుమతి తో నే జరిగిందని " మా||జి|| రాజ గారు సెలవిచ్చారు. మరి అంతే కదా.లక్షల కోట్ల కుంభ కోణం జరిగింది. ప్రధాన మంత్రి కి తెలీదా? DMK పార్టీ కి చెందినా వ్యక్తుల మీద దర్యాప్తు చేసి కొని వందల కోట్లు వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాలకి వాడుకున్నారని జైల్లో పెట్టారు. మరి మిగతా సొమ్మంత ఎక్కడకి పోయింది? ఇటలీ లో మూలుగుతుందా? ఇన్ని రోజులు DMK పార్టీ తో అంట కాగి, తప్పు ని వాళ్ళ మీద నెట్టి , జయ లలిత ప్రాపకం కోసం తిరుగుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో YS ఉన్నన్ని రోజులు , ఈ అధికారం  అంత ఆయనే చలవే అని అటు కేంద్రం , ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భజన చేసి ఆయన పోయాక (?) ఆయన్ని అవినీతిపరుడని అంటున్నారు. ఏం? ఆయన ఆ అవినీతి అంతా అధికారం లో ఉన్నపుడే కదా చేసాడు? కళ్ళు మూసుకు పోయాయా? జగన్ మీద కక్ష సాధింపు కాకపోతేను.
2004 లో కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిందని సోనియా ని అందరు ఆకాశానికి ఎత్తేసారు. త్యాగ మూర్తి,దయామయి,ఈ శతాబ్ది గొప్ప మహిళ? అప్పటి వరకు మచ్చ లేని మనిషి గా ఉన్న మన్మోహన్ ని ప్రధాన మంత్రి గా ముందు కు తెచ్చారు.అప్పటి నుండి ఇప్పటి దాక ఏ దేశం లో జరగనంత అవినీతి మన దేశం లో జరిగింది. దోచుకోడానికి కాదేది అనర్హం అన్నట్టు, అందిన కాడికి దోచుకున్నారు. కాంగ్రెస్ పాలించిన  ప్రతి రాష్ట్రం లో ఇవే ఆరోపణలు వచ్చాయి.మరి ఈ సొమ్మంత ఎక్కడకి పోయింది. ఇటలీ కా?
మరి ఇంత అవినీతి జరిగినప్పుడు , ఆ లోటు ని ఎలా పూడ్చాలి? ఉన్నారుగా సాధారణ జనం. పెంచండి పెట్రోలు.అధికారం లోకి వచ్చిన 7  సం||లలో 11 సార్లు పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు పెంచారు. ఇక ఇవి కాకుండా , ప్రాంతీయత ని , ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. ఎన్నడు లేని విధంగా భారత దేశం లో తీవ్ర వాదులు విరుచుకుపడ్డారు. కాని దాన్ని అదుపు చేయడానికి ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరి కదా కసబ్ లాటి తీవ్ర వాదుల్ని ఓటు బ్యాంకు కాపాడుకోవటం కోసం పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ వచ్చారు .
ప్రభుత్వం ఉంది ప్రజల బాగోగుల్ని చూసుకోడానికా, పీడించి దోచుకోడానికా? ఇది కాక యువ రాజు రాహుల్ కి ఇది తీవ్ర వాదం లా కనిపించడం లేదట.హిందూ సంస్థలదే తీవ్రవాదమాట.ఎవరి కోసం ఈ మాటలు.
కేంద్రం పరిస్థితి గురివింద గింజ సామెతల ఉంది. తన కింద ఉన్న నలుపు చూడకుండా , అవినీతి ఎర గా చూపి అటు కర్ణాటక లోను , ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోను అధికార దుర్వినియోగం చేస్తుంది.ఏమిటిది అని ప్రశ్నిచడానికి బలమైన  ప్రతి పక్షం కాని, నాయకుడు కాని  లేరు. కంచే చేను మేస్తుంది.

ఇటలీ లో ఉన్న మాఫియా ని ఇక్కడకి ,ఇక్కడ ఉన్న సంపదని అక్కడకి తరలించాలని "అమ్మ" ఆలోచనేమో చూడండి. నాదో విన్నపం మీతో పాటు మీ వంది మాగధుల్ని కూడా తీసుకు వెళ్ళండి. మాకు మళ్ళి స్వాతంత్ర్యం ఇప్పించండి.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!